Friday, May 3, 2024

రోగుల్ని ఆదుకొనే అంబులెన్స్‌గా చాపర్ విమానాలు

- Advertisement -
- Advertisement -

పనాజి : క్లిష్ట పరిస్థితిలో ఉన్న రోగులకు అసాధారణ వాతావరణంలో కూడా తక్షణం వైద్యం అందించి ఆదుకోడానికి వీలుగా చాపర్ విమానాలను సకల వైద్య సదుపాయాలతో అంబులెన్స్‌గా భారత నావికా విభాగం మారుస్తోంది. ఈమేరకు గోవా నేవీ విమాన స్థావరం ఐఎన్‌ఎస్ హంస లో అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఎఎల్‌హెచ్)కు మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎంఐసియు)ను అమర్చింది. ఐఎన్‌ఎస్ హంసా లోని ఐఎన్‌ఎఎస్ 323 కు చెందిన ఎఎల్‌హెచ్ ఎంకె 3 కు ఎంఐసియును అమర్చినట్టు నేవీ అధికారిక ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏర్పాటుతో ఎలాంటి ప్రతికూల వాతావరణం లోనైనా క్లిష్టపరిస్థితిలోని రోగులను తక్షణం వైద్యానికి తరలించడానికి వీలౌతుందని చెప్పారు. ఈ ఎంసియుకు రెండు జతల డిఫిబ్రిలేటర్లు, మల్టీపేరా మోనిటర్లు, వెంటిలేటర్, ఆక్సిజన్ సాయం, ఇన్‌ఫ్యూజన్, సిరంజి పంపులు ఉంటాయి. రోగి నోటి లో కానీ, శ్వాస నాళం లోకానీ ఏవైనా ద్రవాలును తొలగించవలసి వస్తే వాటిని తొలగించే సౌకర్యం ఉంది. చావర్ విమానాలకు కేవలం రెండు మూడు గంటల్లోనే ఈ సౌకర్యం అమర్చుకోవచ్చని చెప్పారు. హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ సంస్థ తయారు చేసే ఈ ఎనిమిది ఎంసియుల్లో మొదటి ఎంసియు నేవీకి అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News