Sunday, April 28, 2024

తెలంగాణలో నిజాం ఆనవాళ్లు లేకుండా చేస్తాం: షా

- Advertisement -
- Advertisement -

త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి 12 సీట్లు రావాల్సిందేనన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నాయని.. మూడు పార్టీలు కూడా కుటుంబ అవినీతి పార్టీలని దుయ్యబట్టారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బిజెపి సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్ చరిత్ర చూస్తే అన్నీ స్కాములేనని హోంమంత్రి విమర్శించారు. బిఆర్ఎస్ పదేండ్లలో రాష్ట్రాన్ని దోచుకుందని మండిపడ్డారు. కవిత లిక్కర్ స్కామ్, మియాపూర్ భూ కుంభకోణం బిఆర్ఎస్ హయాంలోనే జరిగాయని చెప్పారు. కాంగ్రెస్ గ్యారంటీలు ఇచ్చిందని.. వాటిని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ దేశంలో రూ.12 లక్షల కోట్ల అప్పు చేసిందని ఫైరయ్యారు. దేశంలో ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి ముస్లీం మహిళలకు న్యాయం చేశామని.. తెలంగాణలో నిజాం ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పారు. ప్రధాని మోడీ పేదల పక్షపాతి.. మూడోసారి కూడా ప్రధాని కావడం ఖాయమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News