Thursday, May 2, 2024

ఇండియాలో మరో లక్ష టిబి మరణాలు

- Advertisement -
- Advertisement -

Another one lakh tuberculosis deaths in India

 ఆరోగ్య సేవలకు అంతరాయం
మరో ఐదేళ్ల వరకూ విషమస్థితి

లండన్ : కోవిడ్ సంక్షోభం ప్రభావం ఇతరత్రా వైద్య చికిత్సలు, ఆరోగ్య సేవలపై పడుతుంది. వచ్చే ఐదేళ్లలో భారతదేశంలో అదనంగా 95000 మంది క్షయవ్యాధిగ్రస్తులు మరణిస్తారని ఓ అధ్యయనంలో తేల్చారు. కరోనా వైరస్ తీవ్రత కారణంగా టిబి చికిత్స సంబంధిత సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రత్యేకించి టిబి నిర్థారణ, తగు సమయంలో చికిత్స ప్రక్రియలలో తలెత్తే జాప్యంతో క్షయ వ్యాధి తీవ్రతరం అవుతుంది. యూరోపియన్ రెస్పిరేటరీ జనరల్‌లో దీనికి సంబంధించిన అధ్యయనాన్ని ప్రచురించారు. టిబి చికిత్స ప్రక్రియలకు ప్రస్తుత కరోనా వైరస్ తీవ్రత గండికొడుతుంది. దీనితో వెనువెంటనే క్షయను కనుగొనడం కానీ , దీనికి సరైన చికిత్సకు కానీ వీలు తగ్గుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామం ఉంటుందని అధ్యయనంలో వెల్లడించారు. టిబి చికిత్స పద్థతులు కనీసం ఇప్పటిలాగా గతంలో మాదిరిగా అయినా ఉండాలి. లేదా వీటిని మరింత పటిష్టం చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇండియా, చైనా, దక్షణాఫ్రికాల్లో మొత్తం మీద టిబి మరణాలు 1,10,000 వరకూ ఉండొచ్చునని అధ్యయనంలో వెల్లడైంది. కరోనా వైరస్ తలెత్తడానికి ముందు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి రోజూ 4వేల మందికి పైగా టిబి రోగులు చనిపోతున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ (ఎల్‌ఎస్‌హెచ్‌టిఎం), లాన్‌కెస్టెర్ వర్శిటీ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. చైనా, ఇండియా, దక్షిణాఫ్రికాల్లో వచ్చే ఐదేళ్లలో ఎంత మంది అదనంగా ఈ టిబితో చనిపోతారు? అనే అంశంపై ఈ పరిశోధకులు దృష్టి సారించారు.

కోవిడ్ 19 తీవ్రతతో ఈ దేశాలలో పలు రకాలుగా వైద్య చికిత్స సేవారంగంపై ప్రభావం పడింది. అంతేకాకుండా పలు ప్రాంతాలలో సామూహిక పరీక్షలకు ఆటంకం ఏర్పడింది. దీనితో తొలి దశలోనే టీబి రోగులను కనుగొనలేకపోతున్నట్లు, దీనితో పలువురు ఈ క్షయవ్యాధి ముదిరి దెబ్బతింటున్నారని వెల్లడైంది. ఇది వచ్చే ఐదేళ్ల వరకూ తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు తెలిపారు.

Another one lakh tuberculosis deaths in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News