Friday, April 26, 2024

ప్రేమ విఫలం.. యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -
Young man commits suicide over love failure
 టిక్‌టాక్‌లో ఆవేదన వివరిస్తూ…

హైదరాబాద్ : ప్రేమ విఫలమైందన్న మనస్థాపంతో ఓ యువకుడు టిక్‌టాక్‌లో తన ఆవేదన వివరిస్తూ అది తన వాట్సప్ స్టేటస్‌లో పెట్టి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఆత్మహత్యకు అరగంట ముందు టిక్టాక్ చేశాడు. ఆ వీడియోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఆ తర్వాత చివరగా అమ్మాయికి ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫోన్ చేసి మరీ చెప్పాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంతోష్ తండ్రి కూడా గతంలో ఇలానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని సూసైడ్ చేసుకున్నాడని, అప్పటి నుంచి ఆ యువకుడి తల్లి బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తుంది.

చేతికందిన కొడుకు ప్రేమలో పడి మధ్యలోనే తనువు చాలించి ఆ తల్లికి శోకాన్ని మిగిల్చి వెళ్లాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కు చెందిన సంతోష్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో సంతోష్ ను మందలించారు. పరిస్థితి చేయి దాటేలా ఉండడంతో అమ్మాయిని వరంగల్ తీసుకెళ్లారు. దీంతో తాను ప్రేమించిన అమ్మాయి దక్కలేదన్న మనస్థాపంతో సదరు యువకుడు ఆత్మహత్యకు అరగంట ముందు తన బాధను టిక్ టాక్ లో చెప్పుకున్నాడు. అనంతరం ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Young man commits suicide over love failure

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News