Tuesday, May 21, 2024

‘అంత ఇష్టం ఏందయ్యా నీకు’.. సాంగ్ ప్రోమో

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. మాటల మాంత్రికుడు దర్శకత్వ పర్యావేక్షణలో సాగర్ కె చంద్ర ఈ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న పవన్ సరసన నిత్యా మీనన్ కథానాయికగా చేస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి అంత ఇష్టం అనే సాంగ్ ప్రోమోను చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. పూర్తి పాటను దసరా రోజున విడుదల చేయనున్నట్లు పేర్కొంది. కాగా, ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది.

‘Antha Istam’ song promo released 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News