Sunday, April 28, 2024

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా ఎపి ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రానికి ముందుగా బస్సు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీ నుండి బెంగళూరు సహా పలు నగరాలకు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించగా మొదట పరిమిత సంఖ్యలోనే బస్సులను నడపాలని నిర్ణయించింది. మొదట 168 సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నాలుగు దశల వారీగా ఐదు వందలకు బస్సు సర్వీసులను పెంచాలని నిర్ణయించారు. సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లు ప్రారంభం కానున్నాయి.

కాగా బస్సులు నడిపేందుకు ఇప్పటికే ఎపి ప్రభుత్వం తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, కర్నాటక ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కర్ణాటక ప్రభుత్వం నుంచి మాత్రమే అంగీకారం రావటంతో ఈ నెల 17 నుంచి సర్వీసులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో భౌతిక దూరంతో పాటు మాస్కులను తప్పనిరిగా ధరించాలన్నారు. అలాగే బస్సుల్లో శానిటైజేషన్ తప్పకుండా చేయాలని ఎపిఎస్‌ఆర్‌టి స్పష్టం చేసింది. ఇక రాష్ట్రానికి వచ్చిన వారిలో 5 శాతం మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే బస్టాండ్‌లలో కూడా కరోనా నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఎపిఎస్‌ఆర్‌సిటిసి ఆదేశాలిచ్చింది.

AP Govt Permits to Inter state Bus services

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News