Sunday, April 28, 2024

అక్కినేని హీరోకు జంటగా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవడం ఏమో కాని కనీసం హీరోయిన్‌గా కూడా ఆఫర్లు దక్కించుకోవడంలో సఫలం కావడం లేదు. ఒకరు, ఇద్దరు మాత్రం చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. అందులో ఒక హీరోయిన్ ఈషా రెబ్బా. ఆమె చిన్న హీరోల సరసన నటిస్తూ కెరీర్‌ను సాగిస్తోంది. వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్న ఆమె ఆ మధ్య పెద్ద హీరో ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ చిత్రంలో నటించింది. కానీ, ఆ సినిమా ఈషా కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు.

‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ తెలుగు వర్షన్‌లో నటించిన ఈ భామ తాజాగా అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటించబోతున్న ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించబోతోంది. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రాన్ని చేస్తున్న సుశాంత్ తన నెక్ట్స్ సినిమాకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఏడాదిలోనే ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఈషా రెబ్బను ఎంపిక చేశారు. త్వరలోనే ఈ చిత్రం అధికారిక ప్రకటన రానుంది.

Eesha Rebba Opposite to Sushanth next movie

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News