Monday, April 29, 2024

దేశ ప్రతిష్ఠపై రాజీ లేదు: రాజ్‌నాథ్‌సింగ్

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: దేశ ప్రతిష్ఠ విషయంలో రాజీ పడబోమని రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. భారత్ బలహీనంగా లేదని, తన రక్షణ సామర్థాన్ని బలోపేతం చేసుకున్నదని రాజ్‌నాథ్ అన్నారు. ఇటీవల చైనా సరిహద్దున లడఖ్ ప్రాంతంలో ఇరు దేశాల సైన్యాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ విషయంలో దృఢంగా వ్యవహరిస్తామని రాజ్‌నాథ్ అన్నారు. మనం బలోపేతమయ్యాయం. అయితే, మన శక్తి ఎదుటివారిని భయపెట్టేందుకు కాదు. మన దేశాన్ని రక్షించుకునేందుకేనని రాజ్‌నాథ్ అన్నారు. సరిహద్దులో పరిస్థితిపై పార్లమెంట్‌నుగానీ మరెవరినిగానీ చీకట్లో ఉంచబోమని, సరైన సమయంలో వివరాలు వెల్లడిస్తామని రాజ్‌నాథ్ తెలిపారు.

చైనా సైన్యం భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిందా..? లేదా..? స్పష్టం చేయాలంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ స్పందించారు. సరిహద్దుల్లో ప్రతిష్టంభన తొలగించేందుకు ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు జరుగుతున్న విషయాన్ని రాజ్‌నాథ్ గుర్తు చేశారు. మన రక్షణ దళాల్ని మరింత బలోపేతం చేసుకుంటున్నామని, జులైలో రఫేల్ యుద్ధ విమానాలు మన వైమానిక దళంలో చేరనున్నాయని రాజ్‌నాథ్ తెలిపారు.

No Compromise on defense of Country: Rajnath Singh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News