Sunday, April 28, 2024

ఎపిలో ‘పంచాయతీ’కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

ఎపిలో ‘పంచాయతీ’కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఈనెల 23 వ తేదీన తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సన్నాహాలు
సుప్రింలో కోర్టును ఆశ్రయించిన సర్కారు

AP High Court Cancels Panchayat Elections 2021

మనతెలంగాణ/హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గురువారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఎస్‌సి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని, ఎస్‌ఇసి వేసిన రిట్ అప్పీల్ పిటిషన్ ను అనుమతిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలు, ప్రజారోగ్యం రెండూ ముఖ్యమేనని తీర్పు వెలువరించే క్రమంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు ఆపేందుకు సహేతుక కారణాలు లేవన్న హైకోర్టు రాజ్యాంగంలోని 9, 9 (A) షెడ్యూల్ ప్రకారం కాలపరిమితిలోగా ఎన్నికలు తప్పనిసరని స్పష్టంచేసింది. తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందని, ఎన్నికలు ఎలా నిర్వహించాలనే దానిపై తుదినిర్ణయం ఎస్‌ఇసి తీసుకుంటుందని, సిఇసికి ఉన్న అధికారాలే ఎస్‌ఇసికి ఉన్నాయని తెలిపింది. సింగిల్ బెంచ్ తీర్పు ప్రాథమిక సూత్రాలకు భిన్నంగా ఉందని, ఎస్‌ఇసికి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదని సూచించింది. ఈ నెల 8న ఎస్‌సి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సమ్మతం తెలపడంతో ఎపి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన కార్యాలయంలో సిబ్బందితో సమావేశమైంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ కోడ్ అమల్లోకి వచ్చినట్టే అని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో పాటు ఈనెల 23 వ తేదీన తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ ను విడుదల చేయబోతున్నారు. ఈనెల 25 వ తేదీన తొలివిడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఫిబ్రవరి 5 వ తేదీన మొదటి విడత పోలింగ్, అదే రోజున కౌంటింగ్ జరుగనున్నట్లు ఇసి నిర్ణయం తీసుకుంంది. ఈక్రమంలో ఈనెల 23 నుంచి నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రాష్ట్ర సీఎస్, డిజిపి, కలెక్టర్లు, ఎస్‌పిలతో ఎస్‌ఈసి సమావేశం కాబోతున్నది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పచ్చజెండా ఊపింది.
ఎన్నికలు సబబే:
పంచాయతీ ఎన్నికలలో ఎన్నికైన నేతలు వ్యాక్సినేషన్ ను ముందుకు తీసుకువెళ్తారని, వ్యాక్సినేషన్ పేరుతో ప్రభుత్వం ఎన్నికలు వాయిదా కోరడంలో సహేతుకత లేదని హైకోర్టు పేర్కొంది. మూడో దశలో భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉన్నందున ఈలోపు ఎన్నికలు నిర్వహణ సబబేనని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా అమెరికాతోపాటు మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించిన అంశాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఇప్పటికే రెండున్నర ఏళ్లుగా స్థానిక ఎన్నికలు జరగలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. టీకాల పేరుతో 2022 వరకు ఎన్నికలు జరపరాదనే ఉద్దేశముందా అనే ప్రశ్న తలెత్తుతుందని కోర్టు అభిప్రాయపడింది.ప్రభుత్వ సహకారం లేకుంటే ఎస్‌ఇసి మళ్లీ కోర్టుకు రావచ్చన్న ధర్మాసనం కిషన్‌సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు గుర్తుచేసింది.
సుప్రీంకోర్టుకు సర్కారు:
పంచాయతీ ఎన్నికల అంశంలో ఎపి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం గురువారం హుటాహుటిన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ప్రభుత్వం అందులో పేర్కొంది. హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది. ఎన్నికలకు సంబంధించి హైకోర్టు గురువారం ఉదయం కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఎపి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

AP High Court permission for Panchayat Elections

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News