Sunday, May 5, 2024

శశికళకు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Corona positive for Shashikala

 

కొవిడ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలింపు

బెంగళూరు: బహిష్కృత అన్నా డిఎంకె నాయకురాలు, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనుంగు నెచ్చెలి వికె శశికళకు కరోనా సోకినట్లు ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు గురువారం రాత్రి వెల్లడించారు. శశికళకు కరోనా పాజిటివ్‌గా పరీక్షల్లో నిర్ధారణ అయిందని, ఆమెను కొవిడ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించినట్లు బెంగళూరులోని బౌరింగ్ ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే ప్రస్తుతం ఆమెకు పలు పరీక్షలు నిర్వహించి డాక్టర్లు పర్యవేక్షణలో ఉంచినట్లు వారు తెలిపారు. సిటి స్కాన్, ఇతర పరీక్షల కోసం ఆమెను వేరే ఆస్పత్రికి రెఫర్ చేసినట్లు బౌరింగ్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మనోజ్ కుమార్ చెప్పారు. కాగా శశికళ ఆరోగ్యం బాగానే ఉందని, ఆమెకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని గురువారం ఉదయం మనోజ్ కుమార్ చెప్పడం గమనార్హం. అక్రమాస్తుల కేసులో ఇక్కడి పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఈ నెల 27న శిక్షాకాలం పూర్తి చేసుకొని విడుదల కావలసి ఉంది.

ఆమెకు ఘన స్వాగతం పలకడానికి ఆమె అభిమానులు సన్నాహాలు చేసుకొంటున్న తరుణంలో బుధవారం ఆమెకు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురు కావడంతో జైలునుంచి బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికి ఆమె ఆక్సిజన్ శాచురేషన్ స్థాయి మామూలుకన్నా తక్కువగా ఉండిందని, ఇప్పుడు మామూలుగా ఉందని కూడా మనోజ్ కుమార్ చెప్పారు. ఆమెను రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి చేయవచ్చని భావించామని, అయితే ఇప్పుడు అయితే సిటి స్కాన్‌తో సహా మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కాగా శశికళ అనారోగ్యం వార్త తెలిసిన వెంటనే చెన్నైనుంచి బెంగళూరు వచ్చిన ఆమ మేనల్లుడు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ కూడా చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News