Monday, April 29, 2024

రిపబ్లిక్ డే కానుకగా…

- Advertisement -
- Advertisement -

Acharya movie Teaser to be release on Jan 26

తెలుగు చిత్రసీమలో మకుటం లేని మహారాజుగా మెగాస్టార్ చిరంజీవి వెలుగొందారు. దాదాపు దశాబ్ద కాలం గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఆయన తిరిగి తన హవాను కొనసాగిస్తున్నారు. కుర్ర హీరోలను మించిన వేగంతో సినిమాలు ప్రకటిస్తూ పూర్తి చేస్తూ వెళ్తున్నారు. ప్రస్తుతం బ్లాక్‌బస్టర్ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో మెగాస్టార్ చేస్తున్న మూవీ ‘ఆచార్య’. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటోంది ఈ చిత్రం. ఇందులో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 40 నిమిషాల నిడివి గల సిద్ధ పాత్రలో చెర్రీ అద్భుతంగా కనిపించనున్నాడట.

ఈ షూట్ కోసం ఈ మధ్యనే ‘ఆచార్య’ సెట్స్‌లో అడుగు పెట్టాడు రామ్‌చరణ్. ఇక భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం టీజర్ విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైందని తెలిసింది. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో జనవరి 26న ఈ బిగ్ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం. వరుస విజయాల దర్శకుడు కొరటాల… మెగాస్టార్‌ను ఎలా చూపించబోతున్నాడో? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Acharya movie Teaser to be release on Jan 26

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News