Monday, April 29, 2024

ట్రాక్టర్ ర్యాలీ చర్చలు విఫలం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ సెంటర్ రూట్ మారదన్న రైతులు
ట్రాక్టర్ ర్యాలీ చర్చలు విఫలం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 26వ తేదీనాటి రైతుల ట్రాక్టర్ ర్యాలీపై చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఢిల్లీ పోలీసు అధికారులు, రైతు సంఘాల మధ్య దీని గురించి గురువారం చర్చలు జరిగాయి. ఢిల్లీలోని రద్దీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డు మీదుగానే తమ ట్రాక్టర్ ర్యాలీ జరిగితీరుతుందని, వేరే రాదార్లకు దీనిని మార్చుకునే ప్రసక్తే లేదని రైతు నేతలు తేల్చిచెప్పారు. అయితే గణతంత్ర దినోత్సవం, శాంతి భద్రతల పరిస్థితి, జనజీవనానికి ఇబ్బంది వంటి విషయాలను పోలీసు అధికారులు ప్రస్తావించారు. ప్రత్యామ్నాయ మార్గాలను నేతల ముందుంచారు. ట్రాక్టరు ర్యాలీకి అనుమతి నిరాకరణ ఆదేశాలు వెలువరించాలనే కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించలేదు.

ఇది కేవలం సంబంధిత పోలీసు అధికారులు, అధికార యంత్రాంగం పరిధిలోని విషయం అని తేల్చిచెప్పింది. ఇరుపక్షాలూ తమతమ వాదనలకు కట్టుబడి ఉండటంతో గురువారం నాటి చర్చలు ప్రతిష్టంభనతోనే నిలిచాయి. సమావేశం తరువాత స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్ విలేకరులతో మాట్లాడారు. తమ నిరసనను దేశమంతటా తెలియచేసేందుకు తాము ఢిల్లీ మధ్య వీధుల నుంచే ట్రాక్టర్ ర్యాలీని తీయాలనుకుంటున్నామని, ఇందులో రాజీ లేదని తేల్చిచెప్పారు. పోలీసు అధికారులు ర్యాలీని ఢిల్లీ వెలుపలికి మార్చుకోవాలంటున్నారని, ఇది తమకు సమ్మతం కాబోదని యాదవ్ తెలిపారు. సింఘూ, టిక్కి, గాజీపూర్ సరిహద్దులలో మకాం వేసిన వేలాది మంది రైతులు ట్రాక్టరు ర్యాలీలో పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నారు. ర్యాలీని కుండ్లి మానేసర్ పల్వాల్ (కెఎంపి) ఎక్స్‌ప్రెస్ వే మీదుగా సాగిస్తే అభ్యంతరం లేదని పోలీసులు తెలిపారు. రైతు నేతలకు ఈ విషయంలో నచ్చచెప్పేందుకు చేసిన యత్నాలు విఫలం అయ్యాయి. సింఘూ సరిహద్దులలోని మంత్రం రిసార్ట్‌లో జరిగిన సమావేశానికి ఢిల్లీ పోలీసు అధికారి, జెసిపి ఎస్‌ఎస్ యాదవ్ సారథ్యం వహించారు. ఇతర పోలీసు అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు.

Farmers Proposed Tractor parade on Republic day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News