Sunday, April 28, 2024

యాపిల్ సరికొత్త రికార్డు

- Advertisement -
- Advertisement -

Apple is now worth 1.5 trillion dollars

 1.5 ట్రిలియన్ డాలర్లు దాటిన మార్కెట్ విలువ
ఈ మార్క్‌ను సాధించిన తొలి అమెరికా కంపెనీగా అవతరణ

న్యూయార్క్ : యాపిల్ కంపెనీ చరిత్ర సృష్టించింది. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా 1.5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌ను చేరుకుంది. దీంతో ఈ మైలురాయి చేరుకున్న తొలి యుఎస్ కంపెనీగా యాపిల్ నిలిచింది. యాపిల్ స్టోర్ అమ్మకాలు, ఎఆర్‌ఎం చిప్, 5జి ఐఫోన్‌లో పనిచేసే మాక్ సిస్టమ్ అమ్మకాల వల్ల యాపిల్ షేర్లు పెరిగాయని విశ్లేషకులు తెలిపారు. యాపిల్ ప్రస్తుత షేరు ధర 352 డాలర్లు.

అదే సమయంలో కంపెనీ మొత్తం 4.3 బిలియన్ షేర్లతో మార్కెట్ క్యాప్ బుధవారం 1.53 ట్రిలియన్లకు పెరిగింది. ఇటీవల మార్కెట్ పరిశోధన సంస్థ ఎవర్కోర్ ఐఎస్‌ఐ అంచనా ప్రకారం, ఐఫోన్ తయారీదారు యాపిల్ 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ ఉన్న సంస్థగా అవతరిస్తుంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ల సంస్థగా అవతరించింది. టెస్లా షేర్లు జూన్ 10న ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

Apple is now worth 1.5 trillion dollars

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News