Thursday, March 28, 2024

ఐఎంఏ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

బీబీనగర్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక శిక్షణ మహిళా డిగ్రీ కళాశాలలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ (ఎకనామిక్స్)లో చేర దలుచుకున్న మహిళా అభ్యర్థుల కోసం ప్రవేశ పరీక్ష కొరకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామక పాండురంగ శర్మ శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా పాండు రంగశర్మ మాట్లాడుతూ ఇంటర్లో ఏ గ్రూపులో చదివిన వారైనా ఈ కోర్సు కు అప్లై చేసుకోవచ్చని ఈ కళాశాలలో ఈ కోర్సుతోపాటు ఆర్మీ లోని త్రివిధ దళాలలో ఆఫీసర్లుగా చేరడానికి అవసరమైన శారీరక శిక్షణ మరియు దానికి అవసరమైన రాత పరీక్షకు సంబంధించిన వానిలో కూడా శిక్షణ ఇవ్వబడుతున్నారు.

ఈ శిక్షణ సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ సర్వీసెస్ మొదలైన పరీక్షల్లో పాల్గొనడానికి కూడా ఉపయోగపడుతుందని అంతేకాకుండా ఈ కళాశాలలో ఎన్సిసి విభాగం కూడా ఉంది. విద్యార్థినిలు తమ డిగ్రీ తో పాటు ఎన్సిసి సర్టిఫికెట్ను కూడా పొందుతారని ఈ కళాశాలలోని విద్యార్థులు క్రీడల్లో, పర్వతారోహణలో మొదలైన వివిధ రంగాల్లో రాణిస్తున్నరని ఆయన అన్నారు. ఈ కళాశాల నుండి గతంలో ఇద్దరు విద్యార్థులు చైనాకు ఇద్దరు విద్యార్థులు స్కాట్లాండ్ కు వెళ్లి వచ్చారు. విదేశాలకు వెళ్లి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత విద్యలకు అవసరమైన సామర్ధ్యాన్ని శిక్షణను ఇక్కడే పొందగలుగుతారు అని ఆయన తెలిపారు.

ఆసక్తి గల విద్యార్థులు www.tswreis.ac.in వ్బ్సైట్లో నుండి ఆన్లైన్ అప్లికేషన్ ఫారం ను 12 జూన్ 2023 వరకు సమర్పించవచ్చు. వీరికి 18 జూన్ 2023 నాడు రాత పరీక్ష ఉంటుంది. జూన్ 14వ తేదీ నుండి తమ తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్బ్సైట్లో లభించే ప్రాస్పెక్టస్ ద్వారా మిగిలిన వివరాలు తెలుసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News