Sunday, April 28, 2024

ఉపాధి హామి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉపాధి హామి నైపుణ్య శిక్షణ కోసం నిరుద్యోగ విద్యావంతుల నుండి హైదరాబాద్ బిసి సంక్షేమ శాఖ కార్యాలయం దరఖాస్తులను ఆహ్వానించింది. 8వ తరగతి నుండి గ్రాడ్యుయేట్స్ వరకు, ఐటిఐ, డిప్లొమా చేసిన వారికి (స్కిల్ డెవలప్‌మెంట్) క్రింద ఉపాధి హామి నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సెల్లింగ్ స్కిల్స్ మార్కెటింగ్, కిర్లోస్కర్ పంప్‌సెట్ మెకానిక్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎసి రిపేర్‌లలో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు https://forms.gle/jp6Mh1Y5qfYojBMk9 వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థులు , నమోదు చేసుకోని వారు కూడా ఈ నెల 17 నుండి 19వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తులు వ్యక్తిగతంగా వచ్చి అసెంబ్లీ ఎదురుగా గల ఐసిఐసిఐ అకాడమి ఫర్ స్కిల్స్, కార్యాలయం మూడో అంతస్తులో సమర్పించాలని సూచించారు. కొత్త బ్యాచ్ ఈ నెల 20 నుండి మార్చి 31 వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. ఇందులో శిక్షణ పొందిన అభ్యర్థులకు 100 శాతం ఉద్యోగం (ప్రైవేట్ సంస్థల్లో) కల్పించబడుతాయన్నారు. శిక్షణ పొందే అభ్యర్థులు హైదరాబాద్‌కు చెందిన వారైతే బస్సుపాస్ సౌకర్యం కల్పించబదుతుంది.

మరిన్ని వివరాలకు సెల్ 9912111129, 9989289569, 9912555526, 04048493340 నెంబర్‌లకు సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుతో పాటు కుల ధృవ పత్రము, ఆదాయ ధృవపత్రము, విద్యార్హత సర్టిఫికెట్లు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు సమర్పించాల్సి ంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News