- Advertisement -
మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి ః చారకొండ మండల కేంద్రంలోని కేజిబివి విద్యాలయంలో రాత్రి వాచ్ ఉమెన్‌గా పనిచేయడానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ ఝాన్సీ రాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల మహిళలు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, ఈ నెల 11న సాయంత్రంలోపు మర్రిపల్లిలో గల ఎంఆర్‌సి భవనంలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఉద్యోగుల ఎంపిక విధానంలో ఎంఈఓ, తహసిల్దార్, ఎంపిడిఓల త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు.
- Advertisement -