Saturday, July 27, 2024

3 రాష్ట్రాలకు బిజెపి పరిశీలకుల నియామకం

- Advertisement -
- Advertisement -

శాసన సభాపక్ష నాయకుల ఎంపికకు సన్నాహాలు

న్యూఢిల్లీ: రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో శాసనసభా పక్ష నాయకులను ఎన్నుకునేందుకు బిజెపి భుక్రవారం పరిశీలకులను నియమించింది. పార్టీ సీనియర్ నాయకులైన రాజ్‌నాథ్ సింగ్‌ను రాజస్థాన్‌కు, మనోహర్ లాల్ ఖట్టర్‌ను మధ్యప్రదేశ్‌కు, అర్జున్ ముండాను ఛత్తీస్‌గఢ్‌కు పరిశీలకులుగా బిజెపి నియమించింది. ఈ మూడు రాష్ట్రాలలో ఎన్నికయ్యే శాసన సభాపక్ష నాయకులు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపడతారు.

రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు పార్టీ నాయకులు సరోజ్ పాండే, వినోద్ తావ్డేలను కూడా రాజస్థాన్‌కు కేంద్ర పరిశీలకులుగా నియమించినట్లు బిజెపి ఒక ప్రకటనలో తెలిపింది. అదే విధంగా..మధ్యప్రదేశ్‌కు ఖట్టర్‌తోపాటు పార్టీ సీనియర్ నాయకులు కె లక్ష్మణ్, ఆశా లక్రాలను కేంద్ర పరిశీలకులుగా పార్టీ నియమించింది. ఛత్తీస్‌గఢ్‌కు ముండాతోపాటు మరో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, పార్టీ నాయకుడు దుష్వంత్ కుమార్ గౌతమ్‌లను పార్టీ పరిశీలకులుగా నియమించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఈ మూడు రాష్ట్రాలలో విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News