Sunday, April 28, 2024

జువెనైల్ హోమ్‌లో ఆర్చరీ విద్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా జువెనైల్ హోమ్‌లో ఆర్చరీ విద్య (విల్లు విద్య) నేర్పించడం జరుగుతోందని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హైదరాబాద్ గాజులరామారాం లోని జువైనల్ స్పెషల్ హోంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి పెట్రోల్ రిటైల్ అవుట్‌లెట్‌కు, కొత్త అదనపు భవన సముదాయం నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం తెలంగాణ జువెనైల్ ఆర్చరీ అకాడమీని ప్రారంభించారు. అనంతరం ప్రాంగణంలోని మోడల్ న్యూట్రి గార్డెన్‌ను ప్రారంభించి పలు రకాల పూలు, పళ్ళ మొక్కలు నాటారు. ఆర్చరీ అకాడమీని ప్రారంభించి విద్యార్థులతో కలిసి ధనస్సు సంధించి విద్యార్థులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిక్షార్హులైన విద్యార్లు మానసికంగా కృంగిపోకుండా పలు శిక్షణలు ఇచ్చి వారు ఉపాధిని పొందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని అన్నారు.

విద్యార్థులకు వారి భవిష్యత్తు పట్ల ఆసక్తి పెంచే విధంగా నేషనల్ కోచ్ ద్వారా ఆర్చరీ విద్యను విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. విద్యార్థుల ఆసక్తిని గుర్తించి హ్యండ్ మేడ్ వస్తువులు, చేనేత దుస్తుల తయారీలో శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. తెలిసీ తెలియక క్షణికాశేశంలో నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న వారిని నేరస్తులుగా పరిగణించకుండా వారిలో మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర జైళ్ళ శాఖ, పెట్రోల్ బంక్ నిర్వహిస్తూ ఖైదీలను భాగస్వామ్యం చేస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తూ వారి కుటుంబాలను పోషించుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. శిక్షార్హులుగా కాకుండా తల్లిదండ్రుల వలే వారిని వృద్ధిలోకి తీసుకువచ్చే విధంగా ఈ స్పెషల్ హోంలో పలు శిక్షణలు ఇస్తున్నాని తెలిపారు.
జాతీయ దర్యాప్తు సంస్థలను బిజెపి దుర్వినియోగం చేస్తోంది
జాతీయ దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. తన స్వార్థ రాజకీయాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందన్నారు. బిజెపి నాయకులు కేంద్ర దర్యాప్తు సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకొని బిఆర్‌ఎస్ నాయకులపై దాడులు ఏస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్, రఘునందన్ రావులు ఈడి దాడులకు సిద్దంగా ఉండాలని బిఆర్‌ఎస్ నాయకులకు చెప్పడం, మరుసటి రోజే ఈడి, సిబిఐ నోటీసులు రావడం జరుగుతోందని, ఈ సంస్థలు బిజెపి నాయకుల కింద పనిచేస్తున్నాయా అని ఆమె నిలదీశారు.

బిఆర్‌ఎస్‌కు భయపడి, ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఎదుర్కోలేక దొడ్డిదారిన దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 75 ఏళ్ళ స్వాతంత్ర చరిత్రలో ఈడి, సిబిఐ , ఐటి దాడులు 5 వేల పైచిలుకు ఉంటే నరేంద్ర మోడి అధికారంలోకి విచ్చాక ఎనిమిదేళ్ళలో 25 వేల పై చిలుకు కేసులు నమోదు అయ్యాయన్నారు. స్వామీజీల ముసుగులో ఉన్న బిజెపి దళారులను పైలట్ రోహిత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టించినందుకే వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న విషయం ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వివేకానంద గౌడ్, ఎంఎల్‌సి సురభి వాణీదేవి, డిప్యూటీ డైరెక్టర్ సర్ఫరాజ్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News