Friday, May 3, 2024

సైనిక పాటవ పోటీలో విషాదం

- Advertisement -
- Advertisement -

Army jawan dead, others injured during training activity

ఓ జవాను మృతి … కుప్పకూలిన 30 మంది

పఠాన్‌కోట్ : శరీర ధారుఢ్య శిక్షణా కార్యక్రమంలో క్లిష్టతర ప్రక్రియను తట్టుకోలేక ఓ సైనిక జవాను ప్రాణాలు వదిలారు. పలువురు అస్వస్థతకు గురై, ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన పఠాన్‌కోట్ దగ్గరిలోని మమూన్ సైనిక కేంద్రం వద్ద శనివారం జరిగింది. దీనికి సంబంధించి ఆర్మీ వర్గాలు వివరాలు తెలిపాయి. 9 కార్ప్ రెక్కీ దళాలకు పోటీ పరీక్షలు శనివారం ఉదయం జరిగాయి. తొమ్మిది గంటల ప్రాంతంలోనే విపరీతమైన ఎండ, తేమవాతావరణంలో జవాన్లు 10 కిలోమీటర్ల మేర పరుగు నిర్వహించారు . ఇది పోటీ పరీక్షలో భాగంగా దాదాపు 72 గంటల వరకూ సాగింది. ఇందులో 30 మంది సైనికులు పాల్గొన్నారు. తమ వృత్తిధర్మం, తమ శక్తిని చాటుకునేందుకు ఈ పోటీ తప్పనిసరి కావడంతో వీరు భుజాలకు బరువులు, ఆయుధాలతో ముందుకు సాగాల్సి వచ్చింది.

అయితే విపరీతమైన వేడిమిని తట్టుకోలేక 34 మంది జవాన్లు మధ్యలోనే కుప్పకూలారు. వీరిని పఠాన్‌కోట్ ఆసుపత్రికి తరలించగా ఓ జవాను కన్నుమూశాడు. పూర్తి స్థాయిలో తమ పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తల నడుమనే ఈ శిక్షణా, శారీర పాటవ విన్యాసాలు జరిగాయని ఓ సీనియర్ సైనికాధికారి తెలిపారు. అయితే తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితితో కొందరు తట్టుకోలేకపోయినట్లు, ఒకరు మృతి చెందినట్లు నిర్థారించారు. స్థానిక సైనిక ఆసుపత్రిలో పలువురికి చికిత్స జరుగుతోందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News