- Advertisement -
ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమమేధ (ఎఐ) ఆస్పత్రిని 14 ఏఐ డాక్టర్లతో చైనా ప్రారంభించింది. ఇది మెడికల్ టెక్నాలజీలో చైనా అత్యంత ఆధునికతను ప్రదర్శిస్తోంది. ఏజెంట్ హాస్పిటల్ అన్న పేరుతో ప్రారంభమైన ఈ ఆస్పత్రి హెల్త్‌కేర్‌లో పెద్ద ముందడుగు. బీజింగ్‌లో ఏర్పాటైన ఈ ఆస్పత్రిని ట్సింఘువా యూనివర్శిటీ పరిశోధకులు రూపొందించారు. 14 ఎఐ డాక్టర్లు, నలుగురు వర్చువల్ నర్సులుతో వైద్య సేవలను విప్లవ సంస్కరణగా తీర్చిదిద్దనున్నారు. సాధారణంగ వైద్యులు రెండేళ్ల పాటు అందించే సేవలను కొన్ని రోజుల్లోనే 10 వేల మంది రోగులకు ఇది అందిస్తుంది.
- Advertisement -