Monday, May 13, 2024

సామాన్యుల చెంతకు సాంకేతికత

- Advertisement -
- Advertisement -

సామాన్యుల చెంతకు సాంకేతికత

అదే ముఖ్యమంత్రి కెసిఆర్ అభిమతం

MLC Nomination Process is Completed in Telangana

ముందుచూపుతోనే గత ఏడాది కృత్రిమమేధ సంవత్సరంగా పాటించాం
వైద్యరంగంలో కృత్రిమమేధది కీలక పాత్ర, కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే వచ్చింది
ఇది భారతదేశానికే గర్వకారణం, కొవిడ్ మరణాల రేటు తెలంగాణలో చాలా తక్కువ
రికవరీలు ఎక్కువే : బయోఏసియా ముగింపు వర్చువల్ సభలో మంత్రి కెటిఆర్
సత్యనాదెళ్లతో ముఖాముఖీ, ఇన్‌పేషెంట్ విభాగంలో కృత్రిమమేధదే పెద్ద పాత్ర,
రాష్ట్ర ప్రభుత్వం కృషి ప్రశంసనీయం : మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాదెళ్ల

మన తెలంగాణ/హైదరాబాద్: ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానమైనా సమాజానికి, పేదలకు ఉపయోగపడాలన్నదే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిమతమని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. అందుకే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకునే ఉంటుందన్నారు. ఒకవైపు ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, మరోవైపు ఇతర రాష్ట్రాలకు దీటుగా తెలంగాణాను అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించేందు కు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయా లు తీసుకుంటున్నదన్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న బయో ఆసియా స దస్సు చివరి రోజైన మంగళవారం మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్లతో కలిసి మంత్రి కెటిఆర్ వర్చువల్ చర్చా వేదికలో పాల్గొన్నారు. ప్రధానంగా ప్రపంచ ఆరోగ్యరంగాన్ని, మానవ జీవనశైలిని సాంకేతికత ఏవిధంగా ప్రభావితం చేస్తుందనే అంశం పై వారిద్దరు చర్చించారు. అనంతరం కెటిఆర్ అడిగిన పలు సందేహాలను సత్య నా దెళ్ల నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మం త్రి కెటిఆర్ మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలో వస్తు న్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. ముఖ్యంగా సిఎం కెసిఆర్ ఎం తో ముందుపుతోనే గత ఏడాదిని రాష్ట్ర ప్రభుత్వం ఎఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) సంవత్సరంగా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. అందుకే వైద్య రంగంలో తె లంగాణ ప్రభుత్వం గణనీయమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. ముఖంగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ తయారీ కూడా హైదరాబాద్ నుంచే వచ్చిందన్నా రు. ఇది కేవలం తమ రాష్ట్రానికే కాకుండా భారతదేశానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. అందుకే కోవిడ్‌లో ఇతర రా ష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో మరణాల రేటు చాలా తక్కువన్నారు. అలాగే రికవరీ రేటు చాలా ఎక్కువన్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌కు క్యాపిటల్ గా హైదరాబాద్ కొనసాగుతోందన్నారు. లైఫ్‌సైన్స్ రంగంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అ త్యంత కీలక పాత్ర పోషిస్తున్నదని మంత్రి కెటిఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మారంగానికి అధిక చేయూతను అందిస్తోందన్నారు. అలాగే బయో టెక్నాలిజీ రంగంలో కూడా స్టార్టప్‌లకు మంచి అవకాశాలు ఉన్నాయని కెటిఆర్ అన్నారు. భవిష్యత్తులో అనేక సమస్యల పరిష్కారానికి స్టార్టప్‌లు ఎంతగానో ఉపయోగపడనున్నాయన్నారు. అంతేకాకుండా వైద్యరంగంలో డేటా సెక్యూరిటికీ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముందన్నారు. కీలకమైన అన్ని రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. దీని కారణంగానే భారత దేశంలో పలు అంశాల్లో తమ రాష్ట్రం ఆదర్శంగా కొనసాగుతోందని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు.
కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో మానవ జీవనశైలిపై మహమ్మారి విసిరిన సవాళ్లు, సాంకేతికత తోడుగా సమస్యలను ఎదుర్కొనేందుకు ఉన్న పరిష్కారాలపై మంత్రి కెటిఆర్ అడిగిన ప్రశ్నలకు సత్యనాదెళ్ల సమాధానాలిచ్చారు. వ్యాధినిరోధక శక్తి వైరస్ ఏవిధంగా స్పందిస్తుందనే సమాచారం వ్యాక్సిన్ అభివృద్ధిలో ఏ విధంగా కీలకమో… ప్రపంచం ఎదుర్కొనే అనేక సవాళ్లకు అందివచ్చిన నూతన టెక్నాలజీ పరిష్కారాలు చూపెడుతుందన్నారు. కొవిడ్ లాంటి గ్లోబల్ సవాళ్లకు ఒక సొసైటీగా కమ్యునిటీ పరిష్కారాలు అవసరమవుతాయని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. సామాన్యుల జీవితాలను ప్రభావితం చేయగలిగే సాంకేతికత అవసరమని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానిస్తూ, ఈ విషయంలో ఎటువంటి చొరవ అవసరమని సత్య నాదెళ్లను ప్రశ్నించారు. నాలెడ్జ్ వర్కర్లతో పాటు ఫ్రంట్ లైన్ వర్కర్లకు సాంకేతికత అందుబాటులో ఉంచడం సవాల్‌తో కూడిందని బదులుగా సత్య నాదెళ్ల బదులిచ్చారు. ఈ తరుణంలో సహకారం, సమర్థత, నేర్చుకోవడం వంటి మూడు అంశాలే మనల్ని మరింత సమర్థులుగా నిలబెడుతుందని తెలిపారు. తెలంగాణలో స్టార్టప్ ఎకోసిస్టంను, టిహబ్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా సత్య నాదెళ్ల కొనియాడారు.
వేగంగా విస్తరిస్తోన్న సాంకేతికత విప్లవంలో గోప్యత, సెక్యూరిటీలను ఏ విధంగా కాపాడాలని అడిగిన మంత్రి కెటిఆర్ ప్రశ్నకు సమాధానంగా ఇంటర్నెట్ భద్రత, కృత్రిమ మేథలకు సంబంధించిన నైతిక విలువలు రాజీపడితే పెనుముప్పు వాటిల్లుతోందని సత్యనాదేళ్ల పేర్కొన్నారు. నియంత్రణ సంస్థలు ఈ అంశాలపై క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ప్రైవేటు ప్లేయర్లైనా, ప్రభుత్వ సంస్థలైనా పౌరుల ప్రైవసీ హక్కును పరిరక్షించాలని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. హెల్త్ కేర్ డేటా తీసుకుంటే పేషెంట్‌కు లబ్ధి జరగాలి కానీ, హాస్పిటల్ నెట్ వర్క్‌కు కాదని ఉదహరించారు. యూజర్ల ప్రైవసీ, సెక్యురిటీ కాపాడటంలో మైక్రోసాఫ్ట్‌లో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కన్నా ముందే డిజైన్ దశలోనే జాగ్రత్తలు తీసుకుంటామని సత్య నాదెళ్ల వివరించారు.
వైద్యరంగంలో ఎఐది అత్యంత కీలకపాత్ర అని అన్నారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం ముందుగానే మేల్కొని గత సంవత్సరాన్ని కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇన్‌పేషెంట్ విభాగంలో కృత్రిమ మేధస్సుది కీలకపాత్రగా ఉందన్నారు. తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించే లక్షంతో పనిచేస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. కాగా బయో ఆసియా సదస్సు నిర్వహణపై ఆయన ప్రత్యేకంగా ప్రసంసించారు.
ముగిసిన సదస్సు
రెండు రోజుల పాటు జరిగిన బయో ఆసియా 18వ సదస్సు మంగళవారం నాటితో ముగిసింది. ఇందులో 72 దేశాలకు చెందిన 31,450 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ అంశాలపై 60 మంది ప్రతినిధులు ప్రసంగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News