Thursday, May 2, 2024

అరెస్ట్ కాదు ఆర్యన్ కిడ్నాప్

- Advertisement -
- Advertisement -
Aryan Khan case is all about kidnapping
వాంఖేడే , ప్రైవేటు ఆర్మీ కుట్ర
మహారాష్ట్ర మంత్రి మాలిక్ ఆరోపణ
షారూక్ మౌనంపై నిలదీత

ముంబై : మాదక ద్రవ్యాల నియంత్రణల ప్రాంతీయ అధికారి సమీర్ వాంఖేడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి నిప్పులు చెరిగారు. సమీర్ తన అధికార ముసుగులో అక్రమాలు చేశారని, చివరికి నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కిడ్నాప్ కుట్రలో పాలుపంచుకున్నాడని తీవ్రస్థాయిలో ఆరోపించారు. క్రూయిజ్ రేవ్ పార్టీపై దాడి పేరిట ఆర్యన్‌ను ఎత్తుకెళ్లి, షారూక్‌తో బేరాలకు దిగాలని ప్లాన్ చేశారని ఈ మంత్రి చెప్పారు. ఆర్యన్‌ను అపహరించుకుని వెళ్లి, పరిహారం డిమాండ్ చేయాలని ఆలోచించిన వారిలో వాంఖేడే కీలక వ్యక్తి అని ఆదివారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో మాలిక్ తెలిపారు. రేవ్‌పార్టీపై ఆర్యన్ ఖాన్ కిడ్నాప్‌నకు జరిగిన కుట్రలో ప్రధాన పాత్రధారిగా ముంబై బిజెపి యువజన విభాగంమాజీ అధ్యక్షులు మొహిత్ భారతీయ వ్యవహరించారని వివరించారు. ముందు ఆర్యన్ అరెస్టును చూపలేదు. ఆర్యన్‌ను తీసుకువెళ్లి షారూక్‌తో పాతిక కోట్లక బేరానికి దిగారు. తరువాత రూ 18 కోట్లకు రాజీకి వచ్చారు.

ముందుగా షారూక్ నుంచి అరకోటి తీసుకున్నారని , అయితే రేవ్‌పార్టీ కేసుకు సంబంధించి ఓ ప్రత్యక్ష సాక్షి ఆర్యన్‌తో కలిసి దిగిన సెల్ఫీ వెలుగులోకి వచ్చిందని, దీనితో కిడ్నాప్ కుట్ర విఫలం అయిందని మంత్రి ఆరోపించారు. షారూక్ రూ 50 లక్షలు ఇచ్చి ఉండటంతో కేసులో తను కూడా బాధితుడు అవుతాడని భయంతో పోలీసులకు ఈ విషయాలు చెప్పడం లేదని మంత్రి తెలిపారు. వాంఖేడే భారతీయను ముంబై శివార్లలోని ఒషివారా ఖబరస్థాన్ వద్ద కలిశారని, ఏ విధంగా ఆర్యన్‌ను కిడ్నాప్ చేయాలి? పరిహారానికి డిమాండ్ చేయడం వంటి పలు అంశాలను మాట్లాడుకున్నారని రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి అయిన మాలిక్ తెలిపారు. అధికారిగా ఉన్న వాంఖేడే సెటిల్మెంట్ల కోసం సొంతంగా తన ప్రైవేటు ఆర్మీ ఏర్పాటు చేసుకున్నారని, ఇందులో జర్నలిస్టు ఆర్‌కె బజాజ్, లాయరు ప్రదీప్ నంబియార్ , ప్రత్యేకించి బిజెపి యువమోర్చా మాజీ నేత భారతీయ గ్యాంగ్ సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికైనా బాలీవుడు సూపర్‌స్టార్ ఈ అన్ని అంశాలపై తమ మౌనం వీడాలని, అన్యాయానికి వ్యతిరేకంగా తాను సాగిస్తున్న పోరుకు మద్దతు ఇవ్వాలని తాను కోరుతున్నట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News