Saturday, May 11, 2024

పిజి కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

17 నుంచి 21 వెబ్ ఆప్షన్లు…23న సీట్ల కేటాయింపు

Counseling schedule releases in PG courses
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో పిజి కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఈ నెల 12వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని సిపిగెట్ కన్వీనర్, ఒయు ప్రవేశాల డైరెక్టర్ ఐ.పాండురంగారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం పిజి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 14వ తేదీన వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థుల జాబితాను పొందుపరిచి, ఈ నెల 15,16 తేదీలలో సవరణలకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ నెల 23వ తేదీన మొదటి విడత పిజి సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 30 వరకు ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని తెలిపారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News