Monday, April 29, 2024

ఫ్రీ రేషన్ పొడగించండి!

- Advertisement -
- Advertisement -
Saugata Roy
ప్రధానికి టిఎంసి ఎంపీ లేఖ

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు సౌగత రాయ్ ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(పిఎంజికెఎవై) కింద ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలలు పొడగించాల్సిందిగా ఆదివారం బిజెపి ప్రభుత్వాన్ని కోరారు. ఆయన ఈ మేరకు ప్రధానికి లేఖ కూడా రాస్తానన్నారు.  ఆయన “ దేశంలోని పేదలు ఇప్పటికీ మహమ్మారి కారణంగా దుష్ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఈ పథకాన్ని ఆపేస్తే వారు చాలా ప్రభావితులవుతారు” అని పేర్కొన్నారు. “ఒకవైపు పెరుగుతున్న ధరల మధ్య ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పేదలకు కేంద్రం ఈ పథకాన్ని రద్దు చేయడం వల్ల వారి భారం మరింత పెరుగుతుంది” అన్నారు. పశ్చిమ బెంగాల్ ఈ లోగా ఈ పథకాన్ని కొనసాగిస్తుందని అన్నారు. కేంద్రం ఇప్పటికే నవంబర్ 30 నుంచి ఈ పథకాన్ని ఎత్తేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ప్రకటన ఒకటి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాంశు పాండే చేశారు. పాండే ఆ ప్రకటన చేసిన మరునాడే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో ఆరు నెలల పాటు ఈ పథకాన్ని కొనసాగిస్తానని తెలపడమేకాక, దీని గురించి ప్రధాని కూడా మరోసారి ఆలోచించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News