Tuesday, April 30, 2024

మోడీజీ మీ మిత్రుడు అబ్బాస్‌ను అడగండి

- Advertisement -
- Advertisement -

నుపుర్ శర్మ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మొహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి మరో సారి దీనిపై స్పందించారు. నుపుర్ శర్మ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు తప్పో, ఒప్పో ప్రధాని నరేంద్ర మోడి తన బాల్యమిత్రుడు అబ్బాస్‌ను అడిగి తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఇటీవల తన తల్లి హీరాబెన్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోది తన చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్ గురించి తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. తన తండ్రికి పక్క ఊర్లో ఓ మిత్రుడు ఉండేవాడని, అతని మరణంతో ఆయన కుమారుడు అబ్బాస్‌ను తమ ఇంటికి తీసుకొచ్చాడని, అతను తనతో పాటే ఉంటూ చదవులు పూర్తి చేశాడని, ఈద్ పండుగ వేళ తన తల్లి ఆ అబ్బాయికి ప్రేమతో వంటలు చేసేదని చెప్పుకొచ్చారు.

అయితే ఈ అంశాన్ని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. “ఎనిమిదేళ్ళ తర్వాత ప్రధాని మోడి తన మిత్రుడిని గుర్తు చేసుకున్నారు. మీకు ఇటువంటి స్నేహితుడు ఉన్నాడని మాకు తెలియదు. ఒకవేళ అబ్బాస్ అనే వ్యక్తి ఇంకా ఉంటే వెంటనే అతడికి కాల్ చేయండి. అసుదుద్దీన్ ఓవైసి, మత గురువుల ప్రసంగాలను వినమని చెప్పండి. మా ప్రసంగాల్లో ఏమైనా తప్పు ఉందా అని అడగండి” అని ఓవైసి అన్నారు. ఒక వేళ అబ్బాస్ చిరునామా ఇస్తే నేనతడి వద్దకు వెళ్తాను, నుపుర్ శర్మ వ్యాఖ్యలు అభ్యంతరకరమో, కాదో అతడినే అడుగుతాను, అని ఓవైసి వ్యాఖ్యానించారు.

రాష్ట్రపతి ఎన్నికపై చర్చించేందుకు ఓవైసికి ఆహ్వానం

మన తెలంగాణ /హైదరాబాద్ : రాష్ట్రపతి ఎన్నికపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి రావాల్సిందిగా ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసిని ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ ఆహ్వానించారు. తనను ఆహ్వానించిన శరద్ పవార్‌కు ఓవైసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశానికి ఎంఐఎం పార్టీ తరఫున ఔరంగబాద్ పార్లమెంటు సభ్యులు ఇంతియాజ్ జలీల్‌ను పంపించనున్నట్లు ఓవైసి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News