Sunday, May 5, 2024

ఎంపిగా గెలిచి మా గ్రామానికి రాలేదని ఆసిఫ్ నగర్ గ్రామస్తుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

Asif nagar villagers protest against bandi sanjay

 

మన తెలంగాణ/కరీంనగర్ రూరల్‌ : కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ఓట్లతో గెలిచి మా గ్రామానికి వచ్చి మొహం చూపిచక యేడాది ఆవుతుందని, ఎంపి బండి సంజయ్ కుమార్ ఎక్కడ ఉన్నడో జాడ తెలిస్తే పాదయాత్రగా వస్తామని కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్ నగర్ (బావుపేట) గామానికి చెందిన రైతులు, రైతు సమన్వయ సమితి సభ్యులు సోమవారం గ్రామంలో బండి సంజయ్ కనిపించడంలేదని, మా ఎంపి మాకు కావాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, రైతు సమన్వయ సమితి సభ్యులు మాట్లాడుతూ.. గత పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓట్లు అడిగి గెలిచి తర్వాత మా రాకుండా ఎంపి బండి సంజయ్ కుమార్ కనిపిచడం లేదని, ఎంపిగా గెలిస్తే కరీంనగర్‌కు ,మా గ్రామానికి అది చేస్తాము… ఇది చేస్తామని తెలిపి నేడు మా గ్రామానికి రాక సంవత్సరం అవుతుందని, ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ విలయతాడవం చేస్తూ అది కరీంనగర్‌లో కరోనా వైరస్ ప్రజలకు వస్తే కనుమరుగైనారని ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా వచ్చి కరీంనగర్‌లో ప్రజలకు భాదలకు గురైతే ప్రజలకు ఏంచేశారని వారు అన్నారు. ప్రజలకు తిండి గింజలు దొరక భాధపడుతున్న మా గ్రామ ప్రజలను పట్టించుకోలేదని వారు అన్నారు. ఏ ఒక్క ఊరికి రాలేక పోతివని వారు అన్నారు. గత ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చి మొహం చూపించి ఓట్ల ఆడిగి, ప్రజలకు అది, ఇది చేస్తానని నమ్మబలికి నేటి వరకు మా గ్రామానికి వచ్చి ప్రజల బాగోగులు, కష్టాలు చూసిన జాడ లేదని వారు అన్నారు. తెలంగాణలో ఎంపి బండి సంజయ్ కుమార్ జాడ ఎవరైన చేప్తే ఆక్కడికి మా గ్రామం పాదయాత్రగా వచ్చి కలుస్తమని వారు అన్నారు. ఎంపిగా గెలిచి మా గ్రామానికి ఒక్క రూపాయి ఇవ్వలేదని, ఎంపిగా గెలిచి కరీంనగర్‌కు , మా గ్రామానికి ఏంచేశారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు సమన్వయ సమితి సభ్యులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News