Tuesday, May 14, 2024

రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తితోనే ఆత్మనిర్భర్ భారత్

- Advertisement -
- Advertisement -

Atmanirbhar Bharat is inspired by Rabindranath Tagore

న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర ఉద్యమంలో విశ్వభారతి పోషించిన కీలక పాత్రను, సార్వత్రిక సోదరభావానికి కారణమని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రశంసించారు. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ.. రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తితోనే ఆత్మనిర్భర్ భారత్ అమలు చేసినట్టు ప్రధాని తెలిపారు. జాతీయవాదానికి విశ్వభారతి వర్సిటీ ముఖచిత్రంగా నిలిచిందన్నారు. ఠాగూర్ చింతన, దూరదృష్టి, కఠోర శ్రమకు ప్రతిరూపమే విశ్వభారతి అని ఆయన పేర్కొన్నారు. విశ్వభారతి వర్సిటీ దేశాని శక్తినిచ్చే సంస్థని ప్రధాని పేర్కొన్నారు. పారిస్ లక్ష్యాలను చేరుకునేందుకు భారత్ సరైన దిశగా పయనిస్తోందన్నారు. పర్యావరణకు భారత్ నేతృత్వం వహిస్తోంది. కళ, సాహిత్యం,  సైన్స్, ఇన్నోవేషన్ వంటి విభిన్న రంగాలలో సంస్థ సాధించిన అద్భుత విజయాలను ప్రధాని ప్రశంసించారు.

Atmanirbhar Bharat is inspired by Rabindranath Tagore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News