Tuesday, April 30, 2024

ఆయుర్వేద ఆస్పత్రిలో అర్ధరాత్రి వేళ.. కరోనా రోగిపై

- Advertisement -
- Advertisement -

Attempted rape of corona patient in Erragadda hospital

హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కోవిడ్-19 బారిన పడి చికిత్స పొందుతున్న నాంపల్లికి చెందిన ఓ యువతిపై అదే ఆస్పత్రికి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి అత్యాచారం చేశాడు. అర్ధరాత్రి వేళ యువతి గదిలోకి వెళ్లిన కామాంధుడు జండూబామ్ మర్దన చేస్తానంటూ లైంగికదాడికి యత్నించాడు. దీంతో బాధితురాలు కాపాడండి అంటూ కేకలు వేసింది. అతని నుంచి తప్పించుకుని బయటకు పరుగులు తీసి అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే నిందితుడిని మందలిచి, ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ఆస్పత్రి యాజమాన్యం వదిలిపెట్టడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదురు వ్యక్తిపై గతంలోనూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స చేయించుకోడానికి యువతులు, మహిళలు భయపడుతున్నారు.

Attempted rape of corona patient in Erragadda hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News