Tuesday, May 7, 2024

జైళ్ల శాఖలో దొంగలు పడ్డారు!

- Advertisement -
- Advertisement -

సీటిబ్యూరో ః దొంగలు ఉండాల్సిన చోటే..దొంగలు పడ్డారు..దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు ఉంది జైళ్లశాఖ తీరు..ఇటీవల హైదరాబాద్‌లోని ఓ సెంట్రల్ జైలలోని వినియోగంలోని ఇనుము తుక్కును బహిరంగ వేలం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈక్రమంలోనే 32టన్నుల తుక్కును వేలం వేస్తున్నట్లుగా అధికారికంగా రికార్డులు చూపించారు. ఈ వేలంలో కిలో రూ.33లు అత్యధిక ధర కోడ్ చేసిన వ్యక్తికి 32 టన్నులను రూ.10.56లక్షలకు పైగానే ఆదాయం జైళ్లశాఖ వచ్చింది. ఈనెల16,17,18 తేదీలలో అధికారికంగా వేలంలో దక్కించుకున్న 32 టన్నులను అధికారికంగా తరలించారు. ఆ తర్వాతే అసలు కథ నడిపించారు .

నిఘా తప్పించి..తుక్కు తరలించిః
24గంటల పాటు సిసి కెమెరాల నీడలో ఉండాల్సిన సెంట్రల్ జైలులో ఆ మూడు రోజులు సిసి కెమెరాలు ప్రధాన ద్వారంలో నిలిపేసి తుక్కు మాయం చేసినట్లు సమాచారం. ఈ నెల 18,19,20 తేదీలలో సెంట్రల్ జైలు ఆవరణలోకి మెయిన్ గేట్ నుంచి ఎంట్రీ అయిన డీసీఎం ట్రక్కుల పుటేజీ లేకుండా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడే తుక్కు చేతివాటాన్ని జైలు సిబ్బంది ప్రదర్శించారనే విమర్శలకు సెంట్రల్ జైలు మరోసారి వివాదాల్లో నిలిచింది. అనాధికారికంగా 40టన్నుల తుక్కును 7డీసీఎం ద్వారా తరలించారు. అక్రమంగా తరలించిన తుక్కు కారణంగా జైళ్లశాఖ ఖాజనా రావాల్సిన దాదాపుగా

రూ.13లక్షలకు సైగా ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖైదీల ద్వారా అక్రమంగా తరలించిన తుక్కును జైలు ఆవరణలో ప్యాక్టరీలో లోడ్ చేస్తుండగా సిసి కెమెరాలు రికార్డు ఉండగా, లోడ్ తర్వాత ఆ డిసిఎంలు ప్రధాన ధ్వారం గుండా బయటికి వెళ్లే సమయంలో మాత్రం ఏలాంటి ఆధారలు లేకుండా జాగ్రత్తలు పడ్డట్లు సమాచారం దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాలతో జైలు ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లినటు ్ల సమాచారం. ఈ ఘటన పూర్తి స్థాయి విచారణ జరిపి అసలు గుట్టు రట్టు చేయాల్సింది అధికారులే..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News