Saturday, May 4, 2024

ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్ తొలి మరణం

- Advertisement -
- Advertisement -

Telangana Reports 161 New Corona Cases

ఆస్ట్రేలియాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు

సిడ్నీ: ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా గల న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ వేరియంట్ మరణంనమోదైంది. కాగా, సోమవారం ఒక్కరోజే ఈ రాష్ట్రంలో 6వేలకు పైగా కొవిడ్-19 కేసులు కొత్తగా నమోదయ్యాయి. పశ్చిమ సిడ్నీలోని ఒక వృద్ధుల సంరక్షణ కేంద్రంలో నివసిస్తున్న ఒక 80 ఏళ్ల వృద్ధుడు ఒమిక్రాన్‌తో మరణించారు. ఆయనకు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయినప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలతో మరణించినట్లు అధికారులు తెలిపారు. న్యూ సౌత్ వేల్స్‌లో సోమవారం ఒక్కరోజే 6,324 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు కన్నా ఇవి 70 ఎక్కువ. ఆసుపత్రులలో 524 మంది చికిత్స పొందుతుండగా వీరిలో 55 మంది ఐసియులో ఉన్నారు. న్యూ సౌత్ వేల్స్‌లో కొవిడ్ కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. ప్రజల మధ్య భౌతికదూరాన్ని కఠినంగా అమలుచేస్తున్నారు. బార్లు, రెస్టారెంట్లలో ప్రజల మధ్య 22 చదరపు గజాల ఎడాన్ని అమలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News