Wednesday, May 8, 2024

‘అవతార్‌ 2’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

ప్ర‌పంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాలివుడ్ చిత్రం ‘అవతార్‌’. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘అవతార్ 2.. ది వే ఆప్ వాటర్’ను జేమ్స్ కామెరూన్ తెర‌కెక్కించాడు. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు సినీ ప్రేక్షకుల ఎదురుచూపులకు తెరదించుతూ మూవీ మేకర్స్ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. పండోరా అనే కొత్త గ్ర‌హాం, నీలి సముద్రం, అద్భుతపరిచే లోకేషన్స్ తో విజువల్‌ వండర్‌ గా రూపొందించిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, డిసెంబర్‌ 16న ‘అవతార్ 2′ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో కానుంది.

Avatar-2 Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News