Saturday, May 4, 2024

సైబర్ నేరాలపై గ్రామీణులకు అవగాహన

- Advertisement -
- Advertisement -

సంగెం: మండలంలోని రామకృష్ణాపురం గ్రామ మహిళలు, పున్నేలు గ్రామంలో శుక్రవారం జీ 20 కంప్యూటర్ ఆఫ్ ఇండియా హైదరాబాద్, వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో సైబర్ సురక్షా ఇన్ రూరల్ ఇండియా పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్రీనివాస్ గరిగి మాట్లాడుతూ.. సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల్లో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైందని అపరిమితంగా, అజాగ్రత్తగా వాడుతున్న వారే ఎక్కువగా సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారని ఇలాంటి వారంతా సైబర్ క్రైమ్ బారిన పడకుండా అవగాహన పెంపొందించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్ క్యూబ్ సొల్యూషన్స్ ఫౌండర్ రమ పట్నాయక్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రకాష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ తిరుపతిరావు, హెడ్స్ డాక్టర్ సత్యవతి, డాక్టర్ తన్వీర్ జహన్, డాక్టర్ ఆయేషా భాను, గ్రామ సర్పంచ్ దేవేందర్‌గౌడ్, బ్యాంకు అధికారులు అనిల్, ప్రశాంత్, అధ్యాపకులు సలీమ్, జీవాని, మహేష్, పల్లవి, మహేశ్వరి, ఆశాలు, గ్రామపంచాయతీ సిబ్బంది, స్టూడెంటు ఛైర్ పర్సన్ రమణకుమార్, కిరణ్‌కుమార్, గ్రామస్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News