Tuesday, May 21, 2024

ఆరోగ్య సిబ్బందికి ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ : వాహనాలను అతివేగంగా ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతూ ఇతరుల ప్రాణాలు తీసి ,వారి కుటుంబాలను అనాథలుగా మారుస్తున్నారని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిస్టూట్ ఏసిపి శంకర్ రాజు అన్నారు. బుధవారం కింగ్‌కోఠి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లకు,ఇతర ఆరోగ్యసిబ్బందికి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో దాదాపు 150 మంది ఆరోగ్య సిబ్బందికి ట్రాఫిక్ రూల్స్ పై ఆవగాహన కల్పించారు.రాంగ్‌రూట్‌లో వెళ్లడం,సెల్‌ఫోన్ డ్రైవింగ్,స్టాప్ లైన్ ,ట్రిబుల్ రైడింగ్‌లు చట్టరీత్యా నేరమని అన్నారు.పాదాచారుల జీబ్రాక్రాసింగ్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు వాహనదారులు ఆపి పాదాచారులకు సహకరించాలని తెలిపారు.వేగం కన్నా ప్రాణం విలువైనదిగా తెలుసు కోవాలని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం ప్రమాదాలను కోరి తెచ్చుకున్నట్లే అన్నారు.వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్,ఇన్సూరెన్స్,పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరని చెప్పారు. అబిడ్స్ ట్రాఫిక్ ఎస్‌ఐ సుభాష్,బేగంపేట ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏఎస్‌ఐ సయ్యద్ వికారుధ్ధిన్,కృష్ణావెంకట ప్రసాద్,చిరంజీవి,ఇతర నర్సింగ్,సెక్యూరిటీ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News