- Advertisement -
అమరావతి: దేవాలయంలో తాను పూజారిని మాత్రమేనని.. మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కు దేవుడే వరం ఇవ్వలేదని.. తానేం చేయాలి? అని ఎపి శాసనమండలి స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిలదీశారు. తనపై ఏ కోర్టుకు వెళ్లినా అభ్యంతరం లేదని అన్నారు. జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతుచూస్తాం, పీకలు కోస్తాం, రప్పా రప్పా అనడం కాదని విమర్శించారు. జగన్ సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించారు. మీరు రారు..ఎమ్ఎల్ఎ లను రానివ్వరని.. ప్రశ్నలు మాత్రం పంపుతారని మండిపడ్డారు. వైసిపి తీరును ప్రజలు ఖండించాల్సిన అవసరం ఉందని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.
Also Read : ఉద్యోగుల విషయంలో ప్రేమ ఒలకబోస్తున్నారు: పయ్యావుల
- Advertisement -