Friday, May 3, 2024

విభిన్నమైన కాన్సెప్ట్‌తో…

- Advertisement -
- Advertisement -

Backdoor movie teaser release

 

ఆర్కిడ్ ఫిలిమ్స్ పతాకంపై కర్రి బాలాజీ దర్శకత్వంలో ‘సెవెన్ హిల్స్’ సతీష్ కుమార్ సమర్పణలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం ‘బ్యాక్ డోర్’. ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం హైద్రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది. ప్రముఖ నిర్మాతలు కె.ఎస్.రామారావు, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, రాజ్ కందుకూరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రముఖ రచయిత-, నిర్మాత కోన వెంకట్, దర్శకులు వీర శంకర్, సంతోషం సురేశ్, ప్రముఖ నటులు, -నిర్మాత కె.అశోక్ కుమార్, దర్శకుడు కర్రి బాలాజీ, నిర్మాత బి.శ్రీనివాసరెడ్డి, హీరో తేజ త్రిపురాన, హీరోయిన్ పూర్ణ తదితరులు పాల్గొన్నారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ‘బ్యాక్ డోర్’ టీజర్ చాలా బాగుందని, దర్శకుడు బాలాజీ ప్రతిభ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపించిందని అతిథులు అన్నారు. ఇప్పటికే నంది అవార్డు గెలుచుకున్న బాలాజీ ‘బ్యాక్ డోర్’తో మరిన్ని అవార్డులు గెలుచుకోవాలని, పూర్ణ కెరీర్‌లో మరో మంచి హిట్ ఫిల్మ్‌గా ఇది నిలుస్తుందని వారు తెలిపారు. తన కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్ ఫిల్మ్‌గా ‘బ్యాక్ డోర్’ నిలిచిపోతుందని, దర్శకుడు బాలాజీ అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని హీరోయిన్ పూర్ణ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News