Tuesday, May 7, 2024

డిసెంబర్ 3న ‘బ్యాక్ డోర్’

- Advertisement -
- Advertisement -

‘Backdoor’ release on December 3rd

 

పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన క్రేజీ ఎంటర్‌టైనర్ ’బ్యాక్ డోర్’ డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రేజీ చిత్రం వరల్డ్‌వైడ్ థియేట్రికల్ హక్కులను కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత- కందల కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, నిర్మాత ఆచంట గోపినాధ్, క్రిష్, కందల కృష్ణారెడ్డి, కర్రి బాలాజీ, తేజ త్రిపురాన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ బ్యాక్ డోర్ చిత్రానికి గల క్రేజ్‌కు తగ్గట్టు భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3న విడుదల చేస్తున్నామని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News