Sunday, May 26, 2024

భారత్‌కు షాక్

- Advertisement -
- Advertisement -

KL Rahul ruled out of two-match Test series

టెస్టు సిరీస్‌కు రాహుల్ దూరం

ముంబై: న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. ట్వంటీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన స్టార్ ఓపెనర్ కెఎల్.రాహుల్ గాయంతో టెస్టులకు అందుబాటులో లేకుండా పోయింది. కివీస్‌పై టీమిండియా క్లీన్‌స్వీప్ చేయడంలో రాహుల్ కూడా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్న రాహుల్ జట్టుకు దూరం కావడం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బగానే విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోరుమీదున్న భారత్‌కు ఇది ఊహించని షాక్‌గా చెప్పొచ్చు.

ఇప్పటికే విరాట్ కోహ్లి తొలి టెస్టుకు అందుబాటులో లేడు. తాజాగా రాహుల్ వంటి కీలక బ్యాట్స్‌మన్ దూరం కావడం టీమిండియా ప్రతికూల అంశంగా పేర్కొంటున్నారు. ఇక రాహుల్ స్థానంలో యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ను టెస్టు జట్టులోకి దీసుకున్నారు. సూర్యకుమార్ కూడా ఫామ్‌లో ఉండడం భారత్‌కు కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. రాహుల్ దూరం కావడంతో శుభ్‌మన్ గిల్‌తో కలిసి మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్‌కు దిగే అవకాశం ఉంది. మరో సీనియర్ రోహిత్ శర్మ కూడా టెస్టులకు అందుబాటులో లేదు. ఇలాంటి స్థితిలో అద్భుత ఫామ్‌లో ఉన్న రాహుల్ దూరం కావడం, టెస్టులకు ఎంపికైన వారికి తగినంత ప్రాక్టీస్ లేకపోవడం కాస్త ఆందోళన కలిగించే అంశమే. కానీ రహానె, పుజారా, వృద్ధిమాన్ సాహా వంటి సీనియర్లు ఉండడం టీమిండియాకు ఊరటనిచ్చే అంశమే.

సూర్యకుమార్‌కు చోటు

మరోవైపు రాహుల్ స్థానంలో యువ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌కు టెస్టు జట్టులో చోటు కల్పించారు. ఈ విషయాన్ని బిసిసిఐ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. గాయం వల్ల రాహుల్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదని, అతని స్థానంలో సూర్యకుమార్ జట్టులోకి వస్తున్నాడని బిసిసిఐ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఇటీవల ముగిసిన టి20 సిరీస్‌లో సూర్యకుమార్ భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. తాజాగా అతనికి టెస్టుల్లో కూడా ఆడే అవకాశం దొరికింది. సూర్యకుమార్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశాలున్నాయి. ఇక తుది జట్టులో స్థానం కోసం సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News