Sunday, May 5, 2024

బడే భాయ్.. చోటే భాయ్ బంధం బయట పడింది

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: ఆదిలాబాద్ వేదికగా ప్రధాని మోదీ, సిఎం రేవంత్ రెడ్డి అలయ్ బలయ్ చేసుకున్నారని,బడే భాయ్, చోటా భాయ్ మధ్య సంబంధం బహిర్గతమైందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం బయటపడిందని పేర్కొన్నారు. గత పార్లమెంట్ ఎన్నికలు మొదలు, ఉప ఎన్నికల్లోనూ బడే భాయ్, చోటా భాయ్ బంధం కొనసాగుతోందని అన్నారు. ఆ రెండు పార్టీలు అనేక మున్సిపాలిటీల్లో చీకటి ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని చెప్పారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ ప్రభుత్వం అడడగానే రూ.13 వేల కోట్ల ప్రత్యేక రుణాలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదని పార్లమెంట్‌లో కేంద్రమే చెబితే, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ విభిన్నంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి భిన్నంగా తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఉందని అన్నారు. గుజరాత్ నమూనా కావాలని రేవంత్ కోరుకుంటున్నారంటే కాంగ్రెస్, రాహుల్ విధానాలతో విభేదిస్తున్నట్లేనని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన ఆర్‌ఎస్‌ఎస్ మూలాలకు వెళ్లి, మోడీకి మోకరిళ్లుతున్నారని ఆక్షేపించారు. మేనిఫెస్టోలో పెట్టిన పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా అడిగేందుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల చెవిలో రేవంత్ క్యాల్లీఫ్లవర్ పెడితే, మోడీ కమలం పువ్వు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News