Tuesday, May 7, 2024

టెన్త్ ప్రశ్నపత్రం లీక్ కేసులో బండి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరీంనగర్‌లో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. బుధవారం రాత్రి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టెన్త్ ప్రశ్నపత్రం లీక్ కేసులో బండి సంజయ్ అరెస్ట్ చేశారు. రాత్రి బండి ఇంటికెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్ అరెస్ట్ సమయంలో ఉద్రిక్తత, తోపులాట జరిగింది. దీంతో లోక్‌సభ స్పీకర్ కార్యాలయానికి బండి ఫిర్యాదు చేశారు.

అర్థరాత్రి తన ఇంట్లోకి అక్రమంగా చొరబడి అరెస్ట్ చేశారని లోక్‌సభ స్పీకర్‌కు బండి ఫిర్యాదు చేశారు. సిఆర్‌పిసి 151 కింద బండి సంజయ్‌కు పోలీసులు నోటీసులు పంపారు. పోలీసులు ప్రివెన్షన్ కస్టడీకి బండి సంజయ్‌ను తీసుకున్నారు.
టెన్త్ పరీక్ష కేంద్రం నుంచి ప్రధాన నిందితుడు బిజెపి కార్యకర్త బూరం ప్రశాంత్ హిందీ పేపర్‌ను బండి సంజయ్‌కు వాట్సప్ ద్వారా పంపినట్లు పోలీసులు విచారణలో తేలినట్టు సమాచారం. ప్రశాంత్ బండి సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా బిజెపి  కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బిజెపి శ్రేణులు పిఎస్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా పోలీసులు మోహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News