Friday, August 8, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలి: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి, మాజీ సిఎం కెసిఆర్ కుమ్మక్కయ్యారని బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. కెసిఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారని అన్నారు. హైదరాబాద్ దిల్ కుష్ అతిథి గృహంలో సిట్ విచారణకు హాజరైన తదుపరి బండి మీడియాతో మాట్లాడుతూ.. ట్యాపింగ్ కేసు విచారణ సిబిఐకి ఇవ్వాలని, ఈ సిట్ కు అధికారాలు లేవని, ఈ విచారణతో ఏమీ జరగదని విమర్శించారు. రాష్ట్రానికి సిబిఐ రావొద్దని కెసిఆర్ ప్రభుత్వం ఆర్డర్ వేసిందని, రాష్ట్రానికి సిబిఐ రాకకు జివొ అడ్డంకిగా ఉందని తెలియజేశారు. ట్యాపింగ్ కేసు విచారణను రేవంత్ రెడ్డే సిబిఐకి అప్పగించాలని సూచించారు. కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, సంతోష్ తప్ప అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని, కెసిఆర్ ప్రభుత్వం విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేసిందని ధ్వజమెత్తారు.

కెసిఆర్ కు బంధాలతో సంబంధం లేదని, కెసిఆర్ కుమార్తె, అల్లుడి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని,కెసిఆర్ కుమార్తె, అల్లుడిని కూడా విచారణకు పిలవాలని (call inquiry) అన్నారు. తనవి, తన కుటుంబ సభ్యులు, సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేశారని, భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసి విన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి, హరీశ్ రావు, బిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. కెటిఆర్ తన సొంత అవసరాల కోసం ఎస్ఐబిని అడ్డాగా మార్చారని ఎద్దేవా చేశారు. లీడర్లు, లాయర్లు, వ్యాపారులు, నటుల ఫోన్లు ట్యాప్ చేశారని, ఒయూ ప్రొఫెసర్ల ఫోన్లు, కూడా ట్యాప్ చేశారని, అన్నారు. పేపరు లీకేజీ కేసు విచారిస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్  ట్యాప్ చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News