Sunday, May 5, 2024

కేరళలో ‘తెలుగు అల్లుళ్లు’, ‘బంగార్రాజు’ టీమ్ లతో సంక్రాంతి వేడుకలు..

- Advertisement -
- Advertisement -

Bangarraju Team to Celebrate Sankranti in Kerala on Jan 13

హైదరాబాద్: సంక్రాంతి అనగానే భోగి మంటలు, కొత్త దుస్తులు, కనుమ పండుగ, హరిదాసులు, అత్త గారింటి వచ్చే అల్లుళ్లు ఇవే కదా అందరికీ గుర్తుకు వచ్చేది. ఏడాదిలో మొదటి పండుగ సంక్రాంతిని గ్రాండ్‌గా చేసుకునేందుకు తెలుగు ప్రజలు సిద్ధమవుతున్నారు. తెలుగు ప్రేక్షకుల ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు, వైవిధ్య భరిత కార్యక్రమాలను అందిస్తున్న ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ జీ తెలుగు సంక్రాంతి పండుగకు తెలుగు రాష్ట్రాలను దాటి కేరళకు వెళ్లింది. ‘ఫుడ్ బౌల్ ఆఫ్ సౌత్’, ‘గాడ్స్ ఓన్ కంట్రీ’గా ప్రఖ్యాతి చెందిన కేరళ సౌందర్యాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించనుంది. అవును, కేరళలో జీ కుటుంబ సభ్యులు చేసుకుంటున్న సంక్రాంతి పండుగ వేడుకలను తనదైన శైలిలో ప్రియమైన అభిమానుల ముందుకు తేనుంది జీ తెలుగు. ఇందులో డ్యాన్స్‌లు, కామెడీ స్కిట్‌లు, మ్యూజిక్‌తో సహా అన్ని ఈవెంట్లు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఈ సంక్రాంతికి మీ అభిమాన తారలు చేసిన సందడి చూడడానికి సిద్ధంగా ఉండండి. 13, 14వ తేదీల్లో రెండు విభాగాలుగా ఈ వేడుకను ఛానల్ ప్రసారం చేయనుంది. వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ సెలబ్రిటీలు, వినోదంతో కూడిన వేడుకలకు మరింత సందడి తీసుకు వచ్చారు.

జనవరి 13 ఉదయం 9 గంటలకు ‘కేరళలో సంక్రాంతి అల్లుళ్ల సందడి’ మన జీ తెలుగు ఛానెల్‌లో టెలికాస్ట్ అవుతుంది. సంక్రాంతి ప్రత్యేకత, తెలుగు ప్రజలు పండుగను ఎంత గొప్పగా చేసుకుంటారో తెలుసుకునేందుకు మూడు గంటల పాటు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని చూసి తీరాల్సిందే. ఈ వేడుకలను తెలుగు ఇంటి ఆడపడుచు, కేరళ తనయ – సుమ కనకాల ముందుండి నడిపించారు. స్థానికంగా ప్రసిద్ధి చెందిన కలరిపట్టు పోరాటం, కొబ్బరి మరియు గోనె సంచులతో పోటీలు, సైక్లింగ్ పోటీ, కబడ్డీ తదితర యాక్టివిటీలు అందరినీ అలరిస్తాయి.

భోగి లేకుండా సంక్రాంతి సంబరాలు ఊహించగలమా?! సంక్రాంతి వేడుకలను ఇతర పండుగల కన్నా అందుకే విభిన్నంగా చూపించేందుకు, భోగి మంటలతో మన జీ తెలుగు ఛానెల్ ఒక యాక్టివిటీని నిర్వహించింది. అలాగే స్థానిక ప్రాచీన పద్ధతుల్లో ఒకటైన ప్రసిద్ధ వల్లం కళి (బోట్ రేస్)లో పాల్గొన్న తమ అభిమాన తారల్ని చూసి ప్రేక్షకులు ఆనందిస్తారు. కేరళలోని అందమైన బ్యాక్ వాటర్స్ లో జీ తెలుగు కళాకారులు నాలుగు జట్లుగా విడిపోయి, ఉత్సాహంతో పోటీ పడడం ప్రేక్షకుల పండుగ వేడుకలను మరో మెట్టు పైకి తీసుకువెళుతుందనడంలో సందేహమే లేదు.

జనవరి 14వ తేదీన ప్రసారమయ్యే రెండో భాగం ‘బంగార్రాజు’ టీంతో అనగా సూపర్ స్టార్లు నాగార్జున, నాగ చైతన్య మరియు కృతి శెట్టితో సహా పలువురు నటులు కనిపించనున్నారు. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా, మరింత ఉత్సహాన్ని ఈ షో అందిస్తుంది. పండుగను మరింత హుషారుగా చేసుకునేందుకు, సెలబ్రిటీలు తమ డ్యాన్స్‌లతో పోటీ పడ్డారు. ‘బంగార్రాజుతో సంక్రాంతి సంబరాలు’ జనవరి 14 ఉదయం 9 గంటలకు ప్రారంభమై మూడు గంటల పాటు ప్రేక్షకులు వినోదాన్ని పంచి పెడుతుంది. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులు టెలివిజన్ స్ర్కీన్‌పై నుంచి చూపు తిప్పుకోనివ్వకుండా ఈ కార్యక్రమం చేస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో వైవిధ్యభరితమైన కార్యక్రమాలను అందిస్తున్న ప్రముఖ ఛానెల్ జీ తెలుగు, రోజూ చూస్తున్నా, ఇంకా చూడాలనిపించేలా కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. సంక్రాంతి పండుగకు నాన్‌స్టాప్ హై వోల్టేజ్ వినోదాన్ని అందించే హామీతో, ఇప్పుడు కేరళలో నిర్వహిస్తున్న వేడుకలను డిజిటల్ వీడియోల రూపంలో కవర్ చేసింది. ఛానెల్‌కు సంబంధించి సోషల్ మీడియా పేజీల్లో కేరళ సౌందర్యం, సంస్కృతికి సంబంధించిన కంటెంట్‌ను చూడవచ్చు. స్థానికుల జీవన విధానం, నోరూరించే రుచికరమైన వంటకాలు, కళలు మరియు సంస్కృతిని తెలుసుకోవచ్చు. పండుగ సంబరాలతో పాటు, కేరళ సౌందర్యాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. పండుగ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవాలని మీకూ అనిపిస్తుంది కదూ! మీ అభిమాన తారలు పండుగకు ఏమేం చేశారో తెలుసుకునేందుకు జనవరి 13, 14 వ తేదీలలో జీ తెలుగు తప్పక చూడాల్సిందే.

Bangarraju Team to Celebrate Sankranti in Kerala on Jan 13

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News