Thursday, September 25, 2025

ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం

- Advertisement -
- Advertisement -

అమరావతి: పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం చేయడంతో పాటు హోంగార్డు లైంగికంగా వేధించాడు. ఈ సంఘటన ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ వివాహితను భర్త వేధిస్తుండడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. హోంగార్డు వివాహిత నంబర్ తీసుకొని పలుమార్లు లైంగికంగా వేధించాడు. హోంగార్డు వేధింపులు శృతిమించడంతో బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ సాయం తీసుకుంది. కానిస్టేబుల్ సదరు మహిళపై అత్యాచారం చేశాడు. దీంతో వివాహిత ఎస్ పికి మొరపెట్టుకుంది. దీనిపై డిఎస్ పి డేగల ప్రభాకర్ స్పందించారు. కానిస్టేబుల్, హోంగార్డును సస్పెండ్ చేశామని డిఎస్ పి వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Also Read:  రైతు ద్రోహి కాంగ్రెస్

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News