Saturday, May 4, 2024

సిగ్గ్గుపడేందుకు నేనేమైనా దొంగనా?.. విలేఖరిపై మండిపడిన మొర్తజా

- Advertisement -
- Advertisement -

ఢాకా: గత ఏడాది వన్డే ప్రపంచకప్‌కు దూరమైన బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ ఆదివారంనుంచి జింబాబ్వేతో తలపడే మూడు వన్డేల సిరీస్‌కు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ముర్తజా సహనం కోల్పోయి ఓ విలేకరిపై విరుచుకుపడ్డాడు. మొర్తజా గత ఎనిమిది వన్డే మ్యాచ్‌లలో ఒకే ఒక వికెట్ తీశాడు.‘ ఇటీవల మీరు కోల్పోయి ఇబ్బంది పడుతున్నందుకు సిగ్గుపడుతున్నారా?’ అని ఓ విలేఖరి ప్రశించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మెర్తజా ‘నేనెందుకు సిగ్గుపడాలి? నేనేమైనా దొంగనా?’ అంటూ ఆ విలేఖరిపై విరుచుకు పడ్డాడు. ‘నేను వికెట్లు తీయకపోతే మీలాంటి వారు, నా అభిమానులు విమర్శించవచ్చు. అంతేకాని నేనెందుకు సిగ్గుపడాలి? బంగ్లాదేశ్ తరఫున ఆడట్లేదా? వేరే దేశానికేమైనా ఆడుతున్నానా? ఒక వేళ నేను సరిగా ఆడకపోతే జట్టు బోర్డు నన్ను తప్పించవచ్చు. ఇది చాలా చిన్న విషయం’ అంటూ మొర్తజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా జింబాబ్వేతో సిరీసే మెర్తజాకు కెప్టెన్‌గా చివరిదని , ఆ తర్వాత కొత్త కెప్టెన్‌ను నియమిస్తామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పేర్కొన్నాడు. మరోవైపు మెర్తజా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని గతంలో చూచాయగా చెప్పినా ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆటను ఆస్వాదించినంతకాలం ఆడతానని తాజాగా చెప్పాడు.

Bangladesh cricketer Mortaza Angry on Journalist

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News