Sunday, April 28, 2024

స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి

- Advertisement -
- Advertisement -

“మెగాస్టార్ చిరంజీవి మంచితనం సముద్రమంత లోతు ఉంటుంది. అతని గొప్పతనం శిఖరమంత ఎత్తు ఉంటుంది. ఈ రెండు కలిసి ఉన్న స్టారే చిరంజీవి”అని అన్నారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరిగిన కార్యక్రమంలో ‘మెగాస్టార్ ది లెజెండ్’ పేరుతో సీనియర్ జర్నలిస్టు వినాయకరావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కె.రాఘవేంద్రరావుతో పాటు టి.సుబ్బరామిరెడ్డి, అల్లు అరవింద్, రామ్‌చరణ్, మురళీమోహన్, వివి వినాయక్, బి.గోపాల్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. “భారతం రాసినప్పుడు వ్యాసుడికి వినాయకుడు అవసరమయ్యారు. చలన చిత్ర భారతంలో మెగాస్టార్ చిరంజీవి గురించి రాయాలంటే ఒక్క వినాయకరావుతోనే సాధ్యమైంది. నా జీవితంలో ఎన్టీఆర్‌తో 12 సినిమాలు, చిరంజీవితో 14 సినిమాలు చేశాను. చిరంజీవితో చేసిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం దర్శకుడిగా నాకు ఎంతో పేరును తీసుకువచ్చింది” అని చెప్పారు. టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. “చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి. అతని కెరీర్‌లో ప్రేక్షకులను అలరించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలున్నాయి. అయితే రాజకీయాల్లోకి వచ్చి కొంత గ్యాప్ తీసుకొని తిరిగి ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న ఘనత చిరంజీవిది. తెలుగు చిత్ర పరిశ్రమలతో అతనిది సువర్ణాధ్యాయం”అని అన్నారు.

Megastar the Legend book launch

Megastar the Legend book launch

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News