- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. తిరుపతి నుంచి పిఠాపురానికి వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. అతివేగం, కుక్క అడ్డురావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే హైవే పెట్రోలింగ్ సిబ్బం ది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రగాయాలతో బయట పడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులను లక్ష్మణ్ (70), సుబ్బాయమ్మ (65), హేమంత్ (25)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -