Tuesday, April 30, 2024

జనగణనలో బిసి కులగణన చేపట్టాలి : బిసి సంఘాల డిమాండ్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో ఆంధ్ర భవన్ వద్ద భారీ ర్యాలీ

మన తెలంగాణ / హైదరాబాద్ : జనగణనలో బిసి కులగణన చేపట్టాలని పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు ఒక్కటై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రాజ్యసభ సభ్యులు, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేసారు. గురువారం ఢిల్లీలో ఆంధ్ర భవన్ వద్ద బిసి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బిసి కులగణన చేప్పట్టాలని నినాదాలు చేసారు. ఈ ర్యాలీకి జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ , డా. మరేష్, మహేందర్ తదితరులు సమన్వయం చేసారు.

ఈ ర్యాలీలో బిసి నాయకులు కర్రీ వేణుమాధవ్, నీలా వెంకటేష్, అనంతయ్య, భూ అంగిరేకుల వరప్రసాద్, పేసాగర్, వేముల రామకృష్ణ, పృథ్వి గౌడ్, డా. పద్మలత, కృష్ణ మూర్తి, ఉదయ్ నేత, రవీందర్, శివ, కిరణ్ భాషయ్య , తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ జనగణనలో కులగణన చేపట్టడానికి కేంద్రంపై ఒత్తిడి పెంచేలా అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు సమావేశంలో ఐకతతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. ఆర్డినెన్స్ ప్యాక్టరీ, రైల్వే, ఎల్‌ఐసి, బిహెచ్‌ఈఎల్, బిడిఎల్, బ్యాంకింగ్, రక్షణ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయరాదని అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచాలని కోరారు. పై రెండు ప్రధాన డిమాండ్ల సాధనకై పార్లమెంటులో ఉన్న 34 రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి పార్లమెంటులో విస్తృతంగా చర్చించాలని, ప్రభుత్వం దిగిరాకపోతే పార్లమెంటు సమావేశాలు బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం కల్పించిన సదుపాయాల కోసం కుల గణన అవసరమని, కుల గణనతో ఒక్కొక్క కులం జనాభాతో పాటు సాంఘీక, ఆర్ధిక, రాజకీయ వివరాలు సేకరించి వారి కులాలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించవచ్చని అన్నారు. జనాభా ప్రకారం కులాల కార్పొరేషన్లకు, పెడరేషన్లకు బడ్జెట్ కేటాయించి వారి ఆర్ధికాభివృద్ధికి చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుందన్నారు. బిసి కులాల మధ్య ఉన్న వ్యత్యాసాలను తొలగించడానికి గ్రూపులుగా వర్గీకరించడానికి కులాల వారి జనాభా లెక్కలు ఉపయోగపడుతాయన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (డి6) ప్రకారం పంచాయత్ సంస్థలలో ఆర్టికల్ 243-T.6 ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించారని, వీటిని అమలు చేయాలంటే ఏగ్రామంలో – ఏ వార్డులో – ఏ మండలంలో – ఏ జిల్లాలో – ఏ మున్సిపాలిటీలో – ఏ మున్సిపల్ కార్పొరేషన్ లో బిసి జనాభా ఎక్కువ ఉంటే ఆస్థానాలు బిసిలకు కేటాయించే అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం జన గణనలో కులగణన చేపట్టడానికి అంగీకరించకుండా బిసి వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంద ఆరోపించారు. బిజెపి పార్టీలో ఉన్న బిసి నాయకులంధరూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. జనగణన పట్టికలో 34 కాలమ్స్ పెట్టడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యతిరేకించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. బిసి కులాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన చారిత్రక సమయం ఆసన్నమైందన్నారు.

BC 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News