Monday, May 6, 2024

బెగ్గింగ్ మాఫియా లీడర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: వికలాంగులతో భిక్షాటన చేయిస్తున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, బేగంబజార్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం….సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలానికి చెందిన బానావత్ రామకృష్ణ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో నిందితుడు వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన గుడ్‌వే ఫౌండేషన్ చైర్మన్ వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. కొద్ది రోజుల తర్వాత ఉద్యోగం మానివేశాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి తన స్నేహితులు రవి, గణేష్‌తో కలిసి శ్రీకృష్ణ ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఇందులో వికలాంగులకు వసతి కల్పిస్తున్నారు.

ఆరు నెలల తర్వాత రవి, గణేష్ పౌండేషన్ నుంచి తప్పుకున్నారు. గణేష్ సొంతంగా అమ్మా చేయుత ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి వికలాంగులతో బెగ్గింగ్ చేయిస్తుండగా మలక్‌పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రవి, గణేష్ తప్పుకోగానే రామకృష్ణ శ్రీకృష్ణ పౌండేషన్ ఏర్పాటు చేశాడు. వికలాంగులతో రద్దీ ప్రాంతాల్లో భిక్షాటన చేయిస్తున్నాడు. వచ్చిన డబ్బుల్లో 20శాతం వారికి ఇచ్చి, మిగతా డబ్బులు తీసుకుంటున్నాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్లు రాజునాయక్, శంకర్, ఏడుకొండలు, ఎస్సైలు సాయితేజ రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, నర్సింహా తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News