Tuesday, May 7, 2024

అల్లుడు అదుర్స్

- Advertisement -
- Advertisement -

సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వంలో హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఓ సినిమా చేస్తున్నాడు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబ్రమణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘అల్లుడు అదుర్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. యూత్ సహా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. నభా నటేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, సోనూ సూద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Bellamkonda Srinivas new movie Alludu Adhurs

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News