Friday, April 26, 2024

ఎసిబి వలలో భద్రాచలం ఎస్‌టిఓ, అకౌంటెంట్‌

- Advertisement -
- Advertisement -

bribe

 

మన తెలంగాణ/భద్రాచలం: ఏసీబి వలలో భద్రాచలం సబ్ ట్రెజరీ అధికారి షేక్ సైదులుతో పాటు సీనియర్ అకౌంటెంట్ ఎం వెంకటేష్‌లు చిక్కారు. గురువారం సాయంత్రం ఒక రిటైర్డ్ ఉద్యోగి వద్ద రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏజన్సీ ప్రాంతమైన చర్లలో వ్యవసాయ శాఖ ఏడీఏగా పనిచేసిన బోదిమళ్ల నారాయణ 2008లో పదవీవిరమణ చేశారు. ఈ క్రమంలో ఆయనకు కొన్ని కారణాల వల్ల పెన్షన్ ఆలస్యమైంది. అందకు సంబంధించిన పత్రాలను సమర్పించగా గత ఏడాది డిసెంబర్‌లో పెన్షన్ చివరి చెల్లింపులు రూ. 28లక్షలు మంజూరయ్యాయి. దానికి సంబంధించిన బిల్లులను భద్రాచలం ట్రెజరీకి పంపించారు. అయితే నారాయణ నుంచి ఎస్టీఓ, అకౌంటెంట్ ఆఫీసర్ రూ.1,50,000 డిమాండ్ చేశారు. దీంతో నారాయణ ఏసీబీ ఆధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో భద్రాచలం కరకట్ట వద్ద నారాయణ నుంచి ఈ మొత్తం తీసుకుంటుండగా ఎస్టీఓ, అకౌంటెట్‌లను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కార్యాలయంలో రికార్డులన్నిటినీ వారు తనిఖీ చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు.

Bhadrachalam Sub Treasury Officer Trap in ACB Net

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News