Saturday, May 18, 2024

రాష్ట్ర పండుగగా భాగ్యరెడ్డి వర్మ జయంతి

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ / హైదరాబాద్ : భాగ్యరెడ్డి వర్మ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. దళితుల అభివృద్ధికి విశేష కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతిని ఈ నెల 22న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. జిల్లా కేంద్రాలన్నింటిలోనూ వర్మ జయంతోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భాగ్యరెడ్డి వర్మ 1906-33 మధ్య కాలంలో హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత పాఠశాలలను స్థాపించారు. ఆయన బాలికల విద్య కోసం కృషి చేశారు.

1906లో ఇసామియా బజార్‌లో బాలికల విద్య కోసం జగన్ మిత్రమండలి ఏర్పాటు చేశారు. జగన్ మిత్రమండలి కార్యాలయంలో 1910లో మొట్టమొదటగా ప్రాథమిక పాఠశాలను స్థాపించారు. ఆ విధంగా ఏడు పాఠశాలలను వరుసగా ఏర్పాటు చేసి 1922లో రెసిడెన్సిమెమోరియల్ వద్ద మరో పాఠశాలను 30 మంది విద్యార్థులతో స్థాపించారు. ఇలా పాఠశాలల సంఖ్య 26కు చేరింది. ఈ పాఠశాలల్లో 2500 మంది విద్యార్థులు చదువుకునే వారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News